ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్దిదారులు ఈ పథకంపై వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గుంతకల్లు నియోజకవర్గం లో ఉన్న గుత్తి గుంటకల్ పామిడిపట్టణాలలోఉచిత గ్యాస్ పథకం కింద పొందుతున్న సిలిండర్లకు తాము చెల్లించిన నగదు మూడు రోజుల్లోపు తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని 99 శాతం మంది లబ్దిదారులు తెలిపారు. ప్రభుత్వం పేరుకు ఉచిత గ్యాస్ అని చెబుతున్నా గ్యాస్ ఏజెన్సీల చేతివాటంతో ప్రభుత్వంపై మచ్చ పడుతుంది. లబ్దిదారులు ఉచిత గ్యాస్ పథకం కింద చెల్లించాల్సిన అసలు బిల్లుకు అదనంగా రూ.80 నుండి రూ.150 వరకు గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్ మంజూరు చేస్తుంది కాబట్టి అదనంగా వసూలు చేయడానికి లైసెన్స్ పొందినట్టుగా ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నుండి ఐదు కిలోమీటర్లు లోపల గల ప్రాంతాలలో ఎటువంటి అదనపు చార్జీలు వసూళ్లు చేయరాదు అయితే ఏజెన్సీలు గ్యాస్ డెలివరీ బాయ్స్ ద్వారా అధికంగా డబ్బులు వసూలు చేయడంపట్ల లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం చేపట్టిన మంచి పథకానికి చెడ్డపేరు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని అదనంగా వసూలు చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి వాటి లైసెన్సులను రద్దు చేయాలి. వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు, సివిల్ సప్లయ్ అధికారులచే ఈ పథకం కింద ఏ ఒక్కరూ అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి.
