అనంతపురం జిల్లా గుత్తి మునిసిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు చెట్నేపల్లి సచివాలయం, పాత మున్సిపాలిటీ కార్యాలయం 8వ సచివాలయం యందు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం డి.యల్.డి.ఓ విజయలక్ష్మి , గుత్తి మునిసిపల్ కమీషనర్ జబ్బార్ మియా ఆధార్ కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాలు లోపల గల బాల, బాలికలకు పుట్టిన తేదీ ధ్రువపత్రం కలిగి ఉండి పిల్లల తల్లితండ్రుల ఆధార్ కార్డులు కలిగిన వారు పిల్లల యొక్క ఆధార్ కార్డులను ఉచితంగా పొందవచ్చు అన్నారు ఆధార్ కార్డులు కలిగి బాల బాలికలకు నేమ్ కరెక్షన్లు, చేతి వ్రేళ్ళు గుర్తింపులు ఈ సేవల ద్వారా పొందవచ్చు అన్నారు. పట్టణ పుర ప్రజలందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ రమేష్,సచివాలయ అడ్మిన్ హరీష్ ,ఎడ్యుకేషన్ సెక్రెటరీ కిషోర్ బాబు, వెల్ఫేర్ సెక్రెటరీ వెంకటేష్, మహిళా పోలీస్ అనిత, హెల్త్ సెక్రటరీ రాజ్యలక్ష్మి, ప్లాన్ సెక్రటరీ ప్రియాంక, అమీనీటిస్ సెక్రెటరీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.