అనంతపురం జిల్లా గుత్తి మండలం, తొండపాడు గ్రామంలో ఈరోజు (బుధవారం) శ్రీ బొలికొండ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్వామి వారి కళ్యాణ మహోత్సవం, భక్తుల మధ్య కనుల పండుగగా మారింది.
ప్రారంభంలో, గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే జయరాం సోదరుడు, గుత్తి టిడిపి ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఆనందంతో ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గుత్తి అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి.
ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, చిన్న రెడ్డి యాదవ్, జక్కలచెరువు ప్రతాప్, చికెన్ శ్రీనివాసులు, వాసు, చెరుకూరి లక్ష్మణ్, డేగ మద్దిలేటి, డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ మరియు ఇతరులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు.