contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

అనంతపురం జిల్లా గుత్తి ఐ సి డి ఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో చాకలి వీధి అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ ఢిల్లీశ్వరి అధ్యక్షతన తల్లిపాల వారోత్సవాలు సామూహిక సీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు, బాలింతలకు తల్లిపాల యొక్క శ్రేష్టతను  శిశువులకు ముర్రుపాల యొక్క శక్తిని వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బలవర్ధకమైన పోషక పదార్థాలు  సద్వినియోగపర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరి మహిళా పోలీస్ భారతి ఏఎన్ఎం భార్గవి రాణి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :