అనంతపురం జిల్లా గుత్తి పట్టణం లోని ఆర్ అండ్ బి అతిథి గృహం నందు వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నిర్మల, సిపిఐ మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ ఫిబ్రవరి 2 వ తేదీ ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేటాయించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని వాపోయారు ఈ బడ్జెట్ కార్మికులకు కర్షకులకు ప్రజలకు యావత్తు సమాజానికి అన్యాయం జరుగుతుందని, ఆంధ్ర ప్రదేశ్ కు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని లేకపోతే దసలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని ఇందులో భాగంగా 17వ తేదీ ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ధర్నాను కార్మికులు కర్షకులు ప్రజలు జయప్రదం చేయాలని కోరారు, నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం , విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ప్రజల పైన భారం వేయడం అన్యాయమని స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ, కెవిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున , మహిళా సంఘం నాయకులు రేవతి, కవిత , సిపిఐ సీనియర్ నాయకులు షఫీ, మహిళా సంఘం మండల సహాయ కార్యదర్శి మాభి తదితరులు పాల్గొన్నారు
