contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో  జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

  •  సేవాగడ్ పవిత్రమైన స్థలం
  •  సేవాగడ్ లో భోజనశాలను త్వరగా పూర్తి చేస్తాం
  •  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
  •  సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. వారు చూపిన బాటలో నడవాలి
  •  అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ

 

అనంతపురం : సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ వెలసిన సేవాగడ్ పవిత్రమైన, ముఖ్యమైన స్థలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శనివారం గుత్తి మండలం సేవాగడ్ లో శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను స్థానిక పండుగగా ప్రకటించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారని, అందుకనుగుణంగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. ప్రభుత్వం జయంతి ఉత్సవాల కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ఉత్సవాల నిర్వహణకు పెట్టిన ఖర్చు అంతా అందిస్తామన్నారు. దేశంలో బంజారాలు వివిధ ఉన్నత స్థానాల్లో ఉన్నారని, వారి స్వస్థలం గుత్తి మండలం సేవాగడ్ లో ఉండడం గర్వకారణంగా ఉందన్నారు. సేవాగడ్ దేశంలో ముఖ్యమైన, పవిత్రమైన స్థలమన్నారు. సేవాగడ్ లో భోజనశాల ఏర్పాటుకు ఎంపీ నిధుల నుంచి పదిలక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని, భోజనశాలను త్వరగా పూర్తి చేస్తామన్నారు. కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కూడా బంజారాలు ఉన్నారని, వారు అందరితో మంచి సంతృప్తికర సంబంధాలు కలిగి ఉంటారని, వారు కష్టపడి చదివి పరీక్షలు రాసి ఉద్యోగులు సంపాదిస్తారని, అయినా వారి మూలస్థలాన్ని మర్చిపోయేవారుకాదన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడం పట్ల అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ప్రకటించారని, సేవాలాల్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వారు చూపిన బాటలో నడవాలని ఈ జయంతి ఉత్సవాలకి ఘనంగా ఏర్పాట్లు చేశారన్నారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. భారతదేశాన్ని సనాతన ధర్మానికి పుణ్యభూమి, కర్మభూమిగా కొలుస్తున్నామని, వందల ఏళ్ల కిందటే సంప్రదాయాన్ని గౌరవించడం కోసం గురజాడ అప్పారావు, రాజా రామ్మోహన్రావు, జ్యోతిబాపూలే, పుట్టపర్తి సత్యసాయి బాబా, తదితరుల చరిత్రను తెలుసుకున్నామని, వారి కోవలోనే సంత్ సేవాలాల్ మహరాజ్ ఆనాడే జంతుబలులు ఇవ్వకూడదని, దురాచారాలు మానుకోవాలని పిలుపునిచ్చారని, అలాంటి మహనీయుని ఆలోచనలను మనం కొలుచుకోవాలన్నారు. సేవాగడ్ మంచి పుణ్యస్థలం అని, ఇక్కడ భోజనశాల కోసం 10 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. ప్రభుత్వం గిరిజన జాతి అభివృద్ధికి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. గిరిజనుల పిల్లలందరినీ తల్లిదండ్రులు బాగా చదివించుకోవాలన్నారు.

అనంతరం సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను బాగా చేసిన ఆర్డీఓ, డిఎస్పీ, డిఎల్డివో, డిటిడబ్ల్యుఓ, ఎంపిడిఓ, తహసీల్దార్ లు, ఆర్డబ్ల్యుఎస్, ట్రాన్స్కో డిఈలను, సిడిపిఓ, సిఐ, మున్సిపల్ కమిషనర్ లను జిల్లా కలెక్టర్, ఎంపీలు శాలువా కప్పి సన్మానించారు. తదనంతరం జిల్లా కలెక్టర్, ఎంపిలను సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ ఎబివిఎస్బి శ్రీనివాస్, డిఎస్పీ శ్రీనివాస్, డిఎల్డివో విజయలక్ష్మి, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ జగన్నాథరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్ర నాయక్, వైస్ ప్రెసిడెంట్ కేశవ నాయక్, జనరల్ సెక్రెటరీ అస్వర్త నాయక్, ట్రెజరర్ ముని నాయక్, ఎంపిడిఓ ప్రభాకర్, తహసీల్దార్ ఓబులేసు, ఆర్డబ్ల్యుఎస్, ట్రాన్స్కో డిఈలను, సిడిపిఓ, సిఐ, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports