అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి భార్య కుమారులతో పెద్దపప్పూరు మండలంలోని అశ్వర్థం దేవస్థానానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పెద్దపప్పూరు మండలం కోటకొండ ఆంజనేయస్వామి సమీపంలోకి రాగానే తాడిపత్రి వైపు వెళుతున్న కారు ఎదురుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురికావడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో చిట్టెం సురేందర్ రెడ్డి పెద్ద కుమారుడు రిత్విక్ రెడ్డి (6) అక్కడికి అక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయి. సంఘటన స్థలంలో హృదయ విదారక సన్నివేశాలు చూసి ఆ దారిన వెళుతున్న పలువురు చలించి పోయారు. అక్కడ ఉన్నవారు పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ కి అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో పెద్దవడుగూరు ఎస్సై ఆంజనేయులు సిబ్బందితో కలిసి వెళ్లి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
