అనంతపురం జిల్లా గుత్తి పట్టణం ఫుట్బాల్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన ర్ల భవనంలో గురువారం పెన్షన ర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ,అదనపు కార్య దర్శి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ గారి94వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి. బ్రిటిష్ వారిని ఎదిరించి దేశ స్వాతంత్ర్య ము కోసం సాయుధ పోరాటం చేసిన వీరుడు. ఈ పోరాటం లో అరెస్ట్ అయినప్పుడు కోర్టులో మేజిస్ట్రేట్ తన పేరు అడిగినప్పుడు జవాబు గా “ఆజాద్”అని గట్టిగా అరిచి చెప్పడంతో మెజిస్ట్రేట్ వీరికి 15 కొరడా దెబ్బలు విధించారు. తన స్నేహితులతో కలసి విడుదల కు చర్చలు జరుగుతున్న సమయంలో పోలీసులు మారు వేశాలలో ఉండడం గమనించి తన వద్ద ఉన్న తు పాకితో ముగ్గురు పోలీసు లను హత మార్చి మిగిలి ఉన్న నాల్గవ బుల్లెట్ తో తనను తాను కాల్చుకుని. 27.02.1931లో వీరమరణం పొందారు అని మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ రామ్ మోహన్,నారాయణరెడ్డి, షైక్షా వళి,శామ్యూల్, చెన్నారెడ్డి, లక్ష్మి నారాయణ రెడ్డి, నారాయణ శెట్టి, దేవదాసు, సరోజ మొదలగు వారు పాల్గొన్నారు.
