contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సిపిఐ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సిపిఐ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  ఆంధ్రప్రదేశ్  మహిళా సమైక్య నాయకులు మహమూద, మాబి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కార్యదర్శి రామదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 35% రిజర్వేషన్ కల్పించాలి, స్త్రీలకు సమాన పని సమాన వేతనం, మహిళల పట్ల అత్యాచారాలు, అఘాయిత్యాలును అరికట్టడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు.అనంతరం జండా ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ మహిళా సంఘం నాయకురాలు రసూల్ బి, రామలక్ష్మి, కమ్మక్క, రెహనా, దస్తగిరమ్మ,షాహిదా తదిరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :