అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూరు బి, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకుడు బళ్ళారి రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కన్వీనర్, మండల కన్వీనర్ లకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా ఆర్ఎస్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జై జగన్ అంటూ నినాదాలు పలికారు. అనంతరం కొత్తగా ఎన్నికైన పట్టణ మరియు మండల కన్వీనర్లు కప్పల బండ మధుసూదన్ రెడ్డి, గంగరాజులకు పూలమాలలతో దుశాలవాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి, సివి రంగారెడ్డి, మల్లయ్య యాదవ్, షఫీ, రంగస్వామి, శ్రీనివాసులు, మామిళ్ళ చెరువు నాగిరెడ్డి, చెట్నెపల్లి నాగేంద్ర, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
