అనంతపురం జిల్లాగుత్తి పట్టణంలోని జడ్ వీరారెడ్డి కాలనీ లో నెలకొన్న వసతులపై ఆర్టీసీ డిపో హెడ్ క్లర్క్ శ్రీపాదా మరియు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు విడివిడిగా అందజేశారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ జెడ్ వీరారెడ్డి కాలనీలో 200 కుటుంబాలకు పైగా ఉన్నాయని దాదాపు వెయ్యి మంది ప్రజలు నివసిస్తున్నారు బస్ స్టాప్ లేనందున చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం వచ్చినా ఎండలు ఉన్న అక్కడ నిలబడ్డానికి వృద్ధులు గర్భిణీ స్త్రీలు మహిళలు నిలబడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక బస్ స్టాప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాలనీలో సెంటెక్స్ ట్యాంకులు, వీధిలైట్లు, డ్రైనేజీ వ్యవస్థలను అంతర్గత రహదారులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు మల్లేష్, కవిత,అశోక్, శృతి, లక్ష్మీదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
