అనంతపురం జిల్లాపామిడి పట్టణంలోగురువారము అనఘాత్రేయ దత్త పాదుక క్షేత్రంలో నవగ్రహ ప్రతిష్టించారు. అనంతర మండల పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేకువజామునే గణపతి పూజ,అనఘా దేవి దత్తత్రేయ పూజలు, నవగ్రహ విశేష అభిషేక అష్టోత్తరపూజలు, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గోపుర కళష కుంభాభిషేకం, నవగ్రహ శాంతి హోమము, పూర్ణహుతి గావించి భక్తాదులకు తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మైసూర్ నుండీ వచ్చిన దత్త శంకరస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఏం శ్రీధర్, లక్ష్మీనారాయణ రెడ్డి అశేష భక్తాదుల మధ్య పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
