గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారి తల్లి శారదమ్మ, సోదరుడి భార్య త్రివేణి గార్ల జ్ఞాపకార్థం శుక్రవారం గర్భిణీ స్త్రీలకు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఉచిత పౌష్టిక ఆహారాన్ని మండలం లోని కొత్తపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మరియు బూత్ కన్వీనర్ సూరి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎం.కె చౌదరి, బద్రి వలి, జక్కల చెరువు ప్రతాప్, చికెన్ శ్రీనివాసులు, ఎర్రగుడి రమేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
