అనంతపురం జిల్లా గుత్తి కోటలో వెలసిన అతి పురాతన రామస్వామి దేవాలయ ప్రాంగణంలో ఏప్రిల్ ఆరవ తారీకున, శ్రీరామనవమి పండుగకు జరుగు కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు హోటల్ అన్నపూర్ణ ప్రసాద్ చేతుల మీదుగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భక్తాదులు విరివిగా పాల్గొని స్వామివారి కరుణ కటాక్షములు పొందగలరని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ చక్రి చంద్రబాబు రాము శేషు తదితరులు పాల్గొన్నారు
