అనంతపురం జిల్లా గుత్తి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సూర్య నారాయణ సివిల్ సప్లై లో ఉత్తమ ప్రతిభ కనబరిచి నందుకు గాను స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ, జిల్లా కాలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రశంసా పత్రం అందుకున్న సూర్య నారాయణ కు తోటి ఉద్యోగులు రేషన్ డీలర్లు శుభాకాంక్షలు తెలిపారు.