అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం పట్టణం లోని పరిటాల శ్రీరాములు కల్యాణమండపం నందు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం లోని ప్రజలు స్వచ్చందంగా తమ సమస్యలను అర్జీల రూపంలో తన దృష్టికి తీసుకురావడం జరిగింది అని తెలిపారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజి, కాలువల సమస్య మరియు రోడ్లు, భూ సమస్యలు తమ ద్రుష్టికి తేవడం జరిగింది అని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం లో ప్రజల సమస్య ల కోసమే ఎన్డీఏ కూటమి కలిసి పని చేస్తున్నాయని, ప్రజలు మెచ్చే పరిపాలన నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో గుమ్మనూరు నారాయణ స్వామి , వాసగిరి మణికంఠ , ఆమ్లెట్ మస్తాన్ , బండారు ఆనంద్ , పత్తి హిమబిందు , కేసీ హరి , BS కృష్ణ రెడ్డి ,తలారి మస్తానప్ప కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
