అనంతపురం, గుత్తి : రబి సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన అనంతపురం జిల్లాలో కరువు మండల జాబితాలో గుత్తి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించకపోవడంపై గుత్తి సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. 20,24,25. రబిసీజన్లో కరువు ప్రభావిత మండలాలను సోమవారం ప్రకటించి అందులో గుత్తి మండలాన్ని చేర్చకపోవడంపై అన్యాయమని, మండలం లో అతివృష్టి అనావృష్టి కారణంగా పంటలు పండగ,రైతులు, రైతు కూలీలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళుతుంటే రైతులు ను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ సంగతి మరిచి కేవలం జిల్లాలో ఏడు మండలాలను కరువు మండలాల ప్రకటించడం కడు సోచనీయమన్నారు. వెంటనే గుత్తి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని లేనిపక్షంలో రైతు సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తహసిల్దార్ ఓబులేష్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు రేవతి, కవిత, డివైఎఫ్ఐ నాయకులు అశోక్ , సావిత్రి కుల్లాయప్ప, శివ , జయమ్మ తదితరులు పాల్గొన్నారు.