అనంతపురం జిల్లా గుత్తి పట్టణం కోటలో వెలసిన అతి పురాతన కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటుచేసిన సీతారాముల కళ్యాణ ఘట్టం కనుల పండుగ జరిగినది. ముందుగా ఆలయ కమిటీ వారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుంటకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్, మాజీ శాసనసభ్యులు మధుసూదన్ గుప్తా, మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూరు బి లను మేళ తాళాలతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించి కళ్యాణ ఘట్టంలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో వేకువ జాము నుండే భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కి భక్తిశ్రద్ధలతో పూజలు గావించారు, కమిటీ వారు ఏర్పాటుచేసిన రామాయణ కథలో ముఖ్య ఘట్టాలను ఏర్పాటు చేసిన కళాఖండాలను, సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలను వినోదాత్మకంగా తిలకించి విందు భోజనాలను ఆరగించారు. పట్టణంలో పలు దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, చెరకూరి లక్ష్మణ్, డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు హోటల్ అన్నపూర్ణ ప్రసాద్, రమేష్, చక్రపాణి ,బీసీ కాలనీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
