అనంతపురం జిల్లా గుత్తి పట్టణం జడ్ వీరారెడ్డి కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో హోమియోపతి డాక్టర్ శ్రీనివాసులు మరియు డాక్టర్ ఝాన్సీ లక్ష్మి జడ్ వీరారెడ్డి కాలనీ వాసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. కాలనీవాసులు దాదాపు 50 మంది వరకు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వైద్యులు రోగాలు ప్రబల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించారు. హోమియోపతి వైద్యులు శ్రీనివాసులు, ఝాన్సీ లక్ష్మి లకు సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున మరియు కాలనీ వాసుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల, మహిళా సంఘం నాయకురాలు కవిత, డివైఎఫ్ఐ నాయకులు అశోక్, ప్రశాంత్, కాలనీవాసులు లక్ష్మీదేవి, ప్రమీల, అరుణ, సుజాత, గంగ తదితరులు పాల్గొన్నారు.