అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోనీ గుత్తి కోటలోని ఎల్లమ్మ గుడి అంగన్వాడీ కేంద్రంలో ఏప్రిల్ 8 నుండి 22 వరకు నిర్వహించు పౌష్టికాహార పక్షోత్సవాలలో భాగంగా పోషణ పక్వాడ మీటింగ్ ను సూపర్వైజర్ నాగేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భము దాల్చిన వెయ్యి రోజుల నుండి రెండు సంవత్సరముల వరకు పిల్లల వ్యక్తిగత శుభ్రత, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. లబ్ధిదారులు తమ మొబైల్ ఫోన్ యాప్ ద్వారా పోషణ ట్రాక్ ను ఇష్టమైన అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకొనుట, జీరో నుండి 59 నెలలు పిల్లలలో ఎదుగుదలను గుర్తించుట, ఆకలిలో తేడాలను గమనించుట, పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారము తీసుకొనుట వల్ల ఊబకాయమును తగ్గించుట తదితర అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుబ్బలక్ష్మి, హెల్పర్ మాబున్ని, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
