జమ్ము కాశ్మీర్ లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి 28 మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం జనసేన పార్టీ అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని కసాపురం రోడ్డు నందు గల సంజీవ నగర్ కాలనీలో ఉండే జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ పట్టణ,మండల అధ్యక్షులు బండి శేఖర్, కురవ పురుషోత్తం, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, కథల వీధి అంజి, సుబ్బయ్య, సుంకర నాగరాజు, కసాపురం రామాంజి, జీవి రెడ్డి, మైనార్టీ నాయకుడు దాదు, ఆటో రామకృష్ణ, ముద్దలాపురం సూర్యప్రసాద్ , ముత్తు తదితరులు పాల్గొన్నారు…
