అనంతపురం జిల్లా / యాడికి : కోల్ కత్తా లో జరిగిన ట్రైనీ డాక్టర్ మౌమితా దేబంత్ ను అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ అయేషా అలీ, డాక్టర్ రాజేశ్వరీ తెలిపారు. దుండగుల చేతిలో అత్యాచారానికి, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ మౌమితా దేబంత్ చిత్ర పటం వద్ద డాక్టర్లు, స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ అయేషా అలీ, డాక్టర్ రాజేశ్వరీ లు మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ ఫై అత్యాచార సంఘటన సభ్య సమాజం తలెత్తుకకోలేనిదని తెలిపారు. ఇలాంటి సంఘటనలను ఖండిస్తూ ప్రతి ఒక్కరు నిందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ మేనేజ్ మెంట్ నాగేంద్ర, శ్రీరంగ,దాదా భాష, ఉపాధ్యాయులు శశినేత్ర, రాజశేఖర్, సిబ్బంది భాగ్యమ్మ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.