అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలో బాట సుంకులమ్మ ఆలయం వద్ద రామ్మోహన్ మునీంద్ర నిర్వహిస్తున్న రెండు షాపుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా రాబడిన సమాచారం మేరకు సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై నబి రసూల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి. వారి వద్ద నుంచి 20 మద్యం బాటీలు స్వాధీన పరచుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్బంగా గుత్తి సర్కిల్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.