అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలోని వై టి చెరువు గ్రామం వద్ద గల చెరువు నుండి గుత్తి చెరువుకు నీటిని పంపిణీ చేసిన గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. గత ఐదు సంవత్సరాలుగా పాలకుల చేతిలో తాగునీరు సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గుత్తి చెరువుకు గెలిచిన నాలుగు నెలలలోనే నీరు అందిస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే కేవలం 70 రోజులలోనే వైటి చెరువు వద్ద ఏర్పాటు చేసిన వాల్వు తిప్పి నీటిని గుత్తి చెరువుకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్తి మండల ప్రజలు ఎదుర్కొన్న తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సోదరులు, గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు నారాయణ, ఎంకే చౌదరి, కోనంకి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.