అనంతపురం జిల్లా గుత్తి సిడిపిఓ కార్యాలయం వద్ద జూలై 10 కోర్కెల దినంగా పురస్కరించుకొని అంగన్వాడీ టీచర్లు మరియు ఇతర సిబ్బంది ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ వివిధ రకాల డిమాండ్లను నెరవేర్చాలంటూ ధర్నా నిర్వహించి సిడిపిఓ ఢిల్లీఈశ్వర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ లీడర్స్ శోభారాణి నాగరత్న పార్వతి గంగ లలిత అరుణ రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.