అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జడ్. వీరారెడ్డి కాలనీలో నివసిస్తున్న అశోక్, అనిత కుమారుడు శివ సాయి గుత్తి పట్టణంలోని వివేకానంద స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. హోంవర్క్ రాయలేదన్న నెపంతో ఉపాధ్యాయురాలు భారతి శివసాయి అనే విద్యార్థి పట్ల విచక్షనా రహితంగా కొట్టడం వల్ల తల్లితండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు ఇలాంటి ఉపాధ్యాయులపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.