అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం నందు శ్రీ గౌతమీపురి గుత్తి నగర ఉత్సవ సమితి వారి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ తెలుగుదేశం పార్టీ గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌతమీపురి గుత్తి నగర ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకోవడం ఆనందించదగ్గ విషయము పట్టణం నందు వినాయక చవితి వేడుకలను హిందువులంతా ఐక్యతతో రాబోవు పండగలను కులమతాలకు అతీతంగా నిర్వహించాలని వినాయక ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తావు ఇయ్యరాదని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హుస్సేన్ పీరా ప్రభుత్వ అధికారులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు