అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామ సచివాలయంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దస్తగిరి ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 ఖరీఫ్ రబీ ఇన్సూరెన్స్ ప్రకటించాలని అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20 వేల రూపాయలు రైతుల ఖాతాలోకి వెంటనే జమ చెయ్యాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లు కు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని 22 జీవోను రద్దు చేయాలనీ, అనంతపురం జిల్లాలో గత సంవత్సరం 2023 ఖరీఫ్ రబీలో తీవ్రమైన కరువు పరిస్థితుల ఏర్పడ్డాయి సకాలంలో వర్షాలు రాక వేరుశనగ, పప్పు సెనగ, మిరప, పత్తి, ఆముదం, జొన్న, కొర్ర, మొక్కజొన్న, సజ్జ,పొద్దుతిరుగుడు, కుసుమ పండ్ల తోటలు తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం రైతులనువెంటనే ఆదుకోవాలి అని మరిన్ని డిమాండ్ల తో వినతి పత్రం అందజేశారు.
- అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20 వేల రూపాయలు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి
- 2023 ఖరీఫ్ రబీ ఇన్సూరెన్స్ ప్రకటించాలి సమగ్ర ఉచిత పంటల బీమా అమలు చేయాలి
- జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిధులు కేటాయించి ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి
- రెండు లక్షల వరకు రైతు రుణాలు రద్దు చేయాలి
- వ్యవసాయం మోటార్లకు మీటర్లు రద్దు చేసి జీవో నెంబర్ 22 రద్దు చేయాలి
- ప్రభుత్వమే టమోటా మార్కెట్ ఏర్పాటు చేసి టమోటా రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి
- భూ యజమానికి సంతకంతో నిమిత్తం లేకుండా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
- అన్ని రకాల ఎరువులు పురుగుమందులు రైతుసేవ కేంద్రాలు ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు సబ్సిడీలతో అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి రైతు సంఘం నాయకులు సుధీర్ రెడ్డి గోవిందు మస్తాన్ శేఖర్ ప్రసాద్ శివప్రసాద్ ఆచారి శ్రీ రామ్ రెడ్డి సుంకన్న రైతులు తదితరులు పాల్గొన్నారు.