అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ సాయి జూనియర్ కళాశాలలో ఘనంగా పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఢిల్లీశ్వరి మాట్లాడుతూ బాలికలకు కౌమార దశలో వ్యక్తిగత శుభ్రత చేతులు శుభ్రత కలిగి ఉండాలని రక్తహీనత పౌష్టికాహార లోపాలు గూర్చి వివరంగా తెలియజేసి వారికి క్విజ్ ను ఏర్పాటు చేసి అందులో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరి కళాశాల ప్రిన్సిపల్ జయ రంగారెడ్డి అంగన్వాడీ టీచర్స్ శోభారాణి ఉమామహేశ్వరి నాగరత్న తదితరులు పాల్గొన్నారు.