అనంతపురం జిల్లా గుత్తి పట్టణ అధ్యక్షుడిగా ఎంకే చౌదరిని ఎంపిక చేసిన గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎంకే చౌదరి కుటుంబం పార్టీకి విశేష సేవలు అందించారు. దీంతో పార్టీలోని కార్యకర్తలు నాయకులు ఏకగ్రీవం చేయడానికి సుముఖత చూపారు. పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్క నాయకుడికి సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేశారు. పార్టీ శ్రేణులతో శుభాకాంక్షలు అందుకున్న ఎంకే చౌదరి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు ఈశ్వర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.