అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తిరుమల లడ్డులో కల్తీ నెయ్యిలో జంతువులకు సంబంధించిన నూనెను వాడలేదన్న విషయాన్ని కచ్చితంగా నిరూపించాల్సిన అవసరం నటుడు ప్రకాష్ రాజ్ పై ఉందని హెచ్చరించారు. కల్తీ నెయ్యి అని మనం మాట్లాడుకుంటునది విషంతో సమానమని దీనిని ఫోర్క్, బీఫ్ మాంసం తినే వారు కూడా తినరన్నారు. ఇదే నెయ్యిని నీవు నీ ఇంటిలో వంటలలో వాడి తింటే నీకు 5 కోట్ల రూపాయలు నజరానగా ఇస్తానని సవాల్ విసిరారు. లేదా కల్తీ నెయ్యి విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని కనీసం నిరూపించినా కూడా నీకు 5 కోట్ల రూపాయలను నజరానాగా ఇస్తామని పేర్కొన్నారు. నటుడిగా నీవు మంచి యాక్టర్ వే కావచ్చు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని మండిపడ్డారు. దేవుళ్ళు దేవుళ్ళ రతాలపై పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.