అనంతపురం జిల్లా గుంతకల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎఫ్ పి షాప్ డీలర్లు ఎండియు లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ లో భాగంగా లబ్ధిదారుల కు బియ్యము పంచదార జొన్నలు ఇంటి వద్దకు రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఎఫ్ పి షాపు నందు 90 శాతం పైగా ఎం డి యు రేషన్ డీలర్స్ సమన్వయంతో పంపిణీ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ రమాదేవి డిప్యూటీ తహసిల్దార్లు సూర్య నారాయణ సుబ్బలక్ష్మి అన్సర్ ఆలం డీలర్ల సంఘం నాయకులు దాదు పీరా నాగరాజు ఎండియూల సంఘం నాయకుడు మురళి ఆచారి తదితరులు పాల్గొన్నారు.