అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మారుతీ నగర్ కి చెందిన రాంబాబు, రవికుమార్ లు ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న ఇద్దరు సోదరుల ఇంటిలోకి శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారని, ఈ ఘటనలో 25 తులాలు వెండి ఆభరణాలు 5 వేల రూపాయలు నగదుతో పాటు ఏటీఎం కార్డులు అపహరించుకుని పోయారన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.