అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని శ్రీమత్ వాసవి కన్యాకాపరమేశ్వరీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 3వ తేది నుండీ 12వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు పామిడి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇల్లూరు ఉపేంద్ర ఒక ప్రకటన లో తెలిపారు. 10రోజలపాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. 3వ తేది రాజరాజేశ్వరి అలంకరణ, లలితా సహస్ర నామ పారాయణం, మణిద్విప వర్ణన, 4న మహాలక్ష్మీ అలంకరము, పిల్లలచే నృత్య ప్రదర్శన, 5న గాయత్రి అలంకరణ, విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామాల ఆలాపన, 6న వెంకటేశ్వరస్వామి అలంకరణ, 12ఏళ్ళ లోపు బాలలకు దేవత మూర్తుల అలంకరణ, 7న అన్నపూర్ణ అలంకరణ, మహిళలకు పాటల పోటీలు, 8న లలితదేవి అలంకరణ, పిల్లలకు శ్లోకాల పోటీ, 9న సరస్వతి దేవి అలంకారం, అష్ట లక్ష్మీ ఆవిర్భావం నాటకం పిల్లలచే, 10న మహిషాసుర మర్ధని అలంకారం, ఖడ్గ మాల ల చెప్పడం, 11న నారాయణి అలంకారం, వాసవి సహస్రనామ పారాయణం, 12విజదశమి రోజు ఉదయం 9గంటలకు శాంతి హోమం, రాత్రి 7గంటలకు విజయలక్ష్మి అలంకారంతో బంగారు రథంపై మేళ తాళలతో, కేరళ డ్రమ్ముల వాయుధ్యాలతో నగరోత్సవం జరుగుతుందన్నారు. ఉదయం 11.30కు రాత్రి 8.30కి మహా మంగళ హారతి తీర్థ ప్రసాద వినియోగం ఆర్యవైశ్య సంఘం, వాసవి మాతృ మండలి, వాసవి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం నిర్వహిస్తామన్నారు.