అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రంలో షాదీ ఖానా నందు మండల మహాసభ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు సమస్యలపై తీర్మానం చేయడం జరిగిందని పంట పొలాలకు వెళ్లే కాలువలో పూడిక తీసి డ్రాప్లు ఏర్పాటుచేసి సాగునీరు చివరి ఆయకట్టు వరకు అందించాలని, 150 రోజులు నీరు ఇవ్వాలని, 2023 పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించాలని మండల కేంద్రమైన పెద్ద వడగూరుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాఅన్నారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు ఆరువందల రూపాయలు కూలి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయాలి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దస్తగిరి పీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు ఈశ్వర్ రెడ్డి యాదవ్ మద్దిలేటి క్రిష్ణు నారాయణ మహమ్మద్ రఫీ ఇసుక నారాయణ హమాలి యూనియన్ నాయకులు. రామాంజనేయులు సునీల్ వీరాంజనేయులు సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
