అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ రోడ్డు నందు గల ఆర్య కటికల ఆరాధ్య దైవం సునామీ జకనీ మాత ఆలయమునకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అనంతపురం పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ తెలుగుదేశం పార్టీ గుత్తి ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ ఆలయ ప్రాంగణంలోని భోజన వసతి గృహ నిర్మాణాలకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా MP మాట్లాడుతూ రాష్ట్రంలోనే బీసీ వర్గాల అభివృద్ధికి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యులు నారా లోకేష్ పెద్దపీట వేశారని కొనియాడారు అలాగే ఆలయ అభివృద్ధికి ఎంపీ నిధులు 10 లక్షల రూపాయలు వెచ్చిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి మాజీ కౌన్సిలర్ సుంకన్న పిల్లెల్లి కృష్ణయ్య చికెన్ శ్రీనివాసులు జక్కలచెరువు ప్రతాప్ మందల నాగరాజు దిల్కా శ్రీనివాసులు న్యాయవాది సోమశేఖర్ ఆలయ కమిటీ సభ్యులు సురేష్ రావు లక్ష్మణరావు సరస్వతి బాయ్ తదితరులు పాల్గొన్నారు