అనంతపురం జిల్లా పెద్ద వడుగురు మండలం క్రిస్టిపాడు గ్రామంలో కామ్రేడ్ జి.వీరన్న స్తూపం వద్ద ఆరవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగానిర్వహించారు. కుల, మత దురహంకార దాడులను నివారించాలంటే సమరశీల ఐక్య ఉద్యమాల నిర్మాణమే కామ్రేడ్ జి.వీరన్న కు నిజమైన నివాళి. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏం బాల రంగయ్య, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప, కామ్రేడ్ జి.వీరన్న చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ వీరన్న ఒక సాధారణమైన పేద దళిత కుటుంబంలో పుట్టి డిగ్రీ వరకు చదువుకొని పేదల కోసం సామాజిక తరగతుల కోసం వారి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. డివైఎఫ్ఐ కార్యకర్తగా ప్రారంభమై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడిగా, సిపిఎం పార్టీ సింగనమల మండల కార్యదర్శిగా, సిఐటియు సంఘంలో వీఆర్ఏ సంఘం నాయకుడిగా, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడుగా పనిచేశారు. అనేక ఉద్యమాలను నిర్వహించారు. ఆలమూరు, సలకం చెరువు, ఎర్రగుడి, క్రిష్టిపాడు, అయ్యవారిపల్లి తదితర గ్రామాల్లో జరిగిన అనేక కుల వివక్షత దురాహంకార దాడులకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల కార్యదర్శి యు మల్లికార్జున, వీరన్న భార్య అరుణ కుమారి ఐద్వా జిల్లా నాయకురాలు రామాంజనమ్మ, రేవతి, లక్ష్మి, వీరన్న బంధువులు సుంకన్న శ్రీరాములు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.