అనంతపూర్ / గుత్తి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులలో అనగా 14, 15, 16వ తేదీలలో భారీ వర్షాలు /వరదలు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తహసిల్దార్ కార్యాలయం, గుత్తి నందు కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడమైనదని గుత్తి తహసిల్దార్ తెలిపారు. వర్షాలు కారణంగా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 08552-223560 కు సమాచారం అందించాలని, అదేవిధంగా 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు
