గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సోమవారం గుంతకల్లు పట్టణం క్యాంపు కార్యాలయం నందు సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ తనయుడు పామిడి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్6,20000 రూపాయలు చెక్కులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గానికి సంబంధించిన పేద ప్రజలు అనారోగ్యాల కారణంగా హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి తెచ్చారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యుడిగా నేను వారికి అండగా ఉండాలని ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అట్టడుగు వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ కుటుంబాలకు ఇంటికి పెద్ద కొడుకు బాధ్యత తీసుకున్నాడు అనేదానికి ఇదే నిదర్శనం కాబట్టి మళ్ళీ ఇటువంటి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు