అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగాతెలుగుదేశం పార్టీ 2024-2026 సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతపురం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గుంతకల్లు పట్టణంలోని 12 వ వార్డు కథలగేరి నందు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదును పెద్ద సంఖ్యలో చేయాలని, లక్ష సభ్యత్వాలకు తగ్గకుండా పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని నాయకులకు కార్యకర్తకలకు పిలుపు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గుమ్మనూరు నారాయణస్వామి గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్, గుత్తి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి డాక్టర్ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు పత్తి హిమబిందు 12వార్డ్ ఇంచార్జ్ ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, గుత్తి తెలుగుదేశం నాయకులు బద్రువలి చికెన్ శ్రీనివాసులు ఎర్రగుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు