అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పరిధిలోని ప్రముఖ చారిత్రక కట్టడమైన గుత్తి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన గుత్తి పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై కార్యకర్తలతో చర్చించిన అనంతరం గుత్తి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు రాసిన ఉత్తరం ను పత్రికలకు విడుదల చేశారు. 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన గుత్తి కోట ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. అయితే గుత్తి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలోని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయన్నారు. అయితే ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సానుకూలమైన స్పందన రాకపోవటం అమానుషమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిరామకృష్ణ తో పాటు గుంతకల్లు నియోజకవర్గం సీనియర్ నాయకులు రమేష్ గుత్తి పట్టణ సిపిఐ నాయకులు రాజు యాదవ్ తో పాటు పలువురు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు