సిపిఎంనాయకులు అనంతపురం జిల్లాలో ఖరీఫ్ లో అతివృష్టి, అనావృష్టి వల్ల సాగు చేసిన పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగిందనీ జిల్లాలోని అన్ని మండలాల ను కరువు మండలాలు గా ప్రకటించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు వి నిర్మల డిమాండ్ చేశారు. జిల్లాలోని 7 మండలాలనే కరువు మాత్రమే కరువు మండలాలు గా ప్రకటించడంపై జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటనను సవరించే టట్లు చూడాలని ఆయన కోరారు. పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా అదనపు పని దినాలు కలిపించే చర్యలు వెంటనే చేపట్టాలన్నారు.
ఈ ఖరీఫ్ లో సకాలంలో వర్షాలు రాక జిల్లాలోని 3 లక్షల ఎకరాలు బీడుగా పెట్టినారు. సాగు చేసిన పంటలు వేరుశనగ, పత్తి, కంది, ఆముదం ఇతర పంటలు జూలై సెప్టెంబర్ లో వర్షాలు రాకపోవడంతో పూర్తిగా దెబ్బ తిన్నాయి. పంటలకు కీలకమైన జులైలో 62 శాతం, సెప్టెంబర్ లో 56 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కాబట్టి జిల్లాలో ని అన్ని మండలాలను కరువు మండలాలు గా ప్రకటించేలా ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మల్లికార్జున మల్లేష్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.