ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ 6 పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం దీపావళి రోజున ప్రారంభమైనది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలోని భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద అనంతపురము జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మిగిలిన సూపర్ 6 హామీలు కూడా అతి త్వరలో ఒక్కొక్కటి అమలు చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్టీయార్ భరోసా పెన్షన్లు 4 వేల రూపాయలకు ఒకేసారి పెంచి ఇప్పటికే గత 4 నెలలుగా అందజేస్తున్నారని అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నారని ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పటిస్తున్నారని దీనిని గమనించి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త చంద్రబాబు నాయుడు అమల చేసే పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి తహసిల్దార్ ఓబులేసు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా టిడిపి జనసేన పట్టణ అధ్యక్షులు MK చౌదరి పార్టీలు సురేష్ చిన్న వెంకటేశులు చికెన్ శ్రీనివాసులు ఎర్రగుడి రమేష్ చెరకూరి లక్ష్మణ్ నగదాన్ని జయన్న తదితరులు పాల్గొన్నారు.