contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అభివృద్దే కూటమి లక్ష్యం : ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు టిడిపి గుంతకల్లు ఇంచార్జ్ నారాయణస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గుంతకల్లు పట్టణము నందు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ప్రజలు పడిన కష్టాలను చూసి చలించిపోయిన కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 860 కోట్ల రూపాయలతో రహదారులు మరమ్మత్తులకు నిధులు కేటాయించి గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా గుంతకల్లు నియోజకవర్గ వ్యాప్తంగా 51 కిలోమీటర్లు రోడ్లు మరమ్మతులతో పాటు రోడ్లకు ఇరువైపులా కంప చెట్లు కల్వర్టు నిర్మాణాలు కొరకు 54లక్షలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :