అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ లో స్థిరాస్తి పన్ను నీటి పన్ను వాణిజ్య పన్ను మరియు వెకంట్ ల్యాండ్ పన్ను వసూళ్లలో 2024-25 గాను ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ కమిషనర్ జబ్బర్ మియా నిర్వహించారు ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ మున్సిపాలిటీ టాక్స్ ను 100% పూర్తి చేయాలని ఆదేశించారు ఉదయం 8 గంటల నుండి విధి నిర్వహణలో పాల్గొనాలన్నారు పాత బకాయిలతో పాటు ప్రస్తుత పన్నుల వసూళ్లలో వేగం పెంచాలన్నారు మున్సిపాలిటీ పుర ప్రజలకు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్వో సతీష్ కమలాకర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్షావలి నోడల్ అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు