అనంతపురం జిల్లా గుత్తి పట్టణం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాద్యుడు వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ పదవి టిసి వరుణ్ కు కేటాయించడం హర్షనీయమని నవసమాజ నిర్మాణానికి నడుంబిగించిన కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా 15 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసినా ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టిసి వరుణ్ నీ గుర్తించి అహుడా చైర్మన్ పదవిని ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. యువ నాయకుడిగా ప్రజా రాజ్యం పార్టీలో అడుగుపెట్టి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2019 ఎన్నికలలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయిన కృంగిపోకుండా తర్వాత 2024 ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరసావహిస్తూ కూటమి విజయానికి దోహదపడి, మరి ముఖ్యంగా ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఎన్నో కష్టనష్టాలను భరించి, వాటిని అధికమించి ఈరోజు అహుడా చైర్మన్ గా ఎన్నికవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఈనెల 14వ గుత్తి బాటలో సుంకులమ్మ ఆలయం నుండి వయా గుత్తి పట్టణం మీదుగా అనంతపురం పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలుగుదేశం, బిజెపి, జనసేన కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు పోతురాజుల చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ గుత్తి సీనియర్ నాయకులు నాగయ్య రాయల్, అశ్వ నాగప్ప, అఖండు భాష, ధను, మిద్దె ఓబులేసు, హసన్, రమేష్ గుంతకల్ నాయకులు కసాపురం నంద, గాజుల రాఘవేంద్ర, సుబ్బయ్య, అమర్, సుంకర నాగరాజు, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.