అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సి ఎస్ ఐ చర్చ్ నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు అయినా సందర్భంగా గత మూడు రోజులు గా క్రైస్తవులు జరుపుకుంటున్న వేడుకలలో గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మునూరు ఈశ్వర్, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మునూరు నారాయణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇలాంటి వేడుకలలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఎన్నికలలో మా కుటుంబానికి గుత్తి పట్టణ వాసులు తిరుగులేని విజయాన్ని అందించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు రుణపడి ఉంటామన్నారు. నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నిధులు కూడా గుత్తి పట్టణానికి ఎక్కువగా వెచ్చిస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వారి వంతుగా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎం.కె చౌదరి, జక్కలచెరువు ప్రతాప్, చికెన్ శ్రీనివాసులు, డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ, చెరుకూరి లక్ష్మణ్, క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు
