అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ ఎస్సీ కాలనీలో వెలసిన సుంకలమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవమునకు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ , గుత్తి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మునూరు నారాయణ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో 50.000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు గుంటకల్ నియోజకవర్గ ప్రజల పై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఏకాంతమయ్య , జక్కలచెరువు ప్రతాప్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
