contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

CPM: రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

పెద్దవడుగూరు, అనంతపురం జిల్లా: కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు, కార్మికుల సంక్షోభం మరింత తీవ్రతరం అయిందని సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జీపు జాతలో పాల్గొన్న నాయకులు, పలు డిమాండ్లను సమర్థించారు. ఈ నిరసన కార్యక్రమం పెద్దవడుగూరు మండల కేంద్రమైన పెద్దవడుగూరులో నిర్వహించారు.

సిపిఎం నాయకులు మాట్లాడుతూ, “దేశంలో అన్నం పెట్టేది రైతులు, సర్వసంపదను సృష్టించేది కార్మికులు. అయితే, బిజెపి ప్రభుత్వం వ్యవసాయం, కార్మిక రంగాలపై దాడి చేస్తూ దేశ ప్రజలకు పెనాలిటీలు పెట్టడం ఆపలేదు” అని ఆరోపించారు.

ఈ నిరసనలో అనేక కీలక డిమాండ్లను విన్నవించారు:

  1. విద్యుత్ సవరణ బిల్లు 2022ను వెంటనే రద్దు చేయాలని కోరారు.
  2. వ్యవసాయ మోటార్లకు గృహ వినియోగం కోసం స్మార్ట్ మీటర్లు బిగించే ప్రణాళికను ఆపాలని డిమాండ్ చేశారు.
  3. అనంతపురం జిల్లాకు సరిపడా నికర జలాలు కేటాయించి శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
  4. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని, 2023 సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంటలపై వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు.
  5. ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి, రోజుకు కూలి 600 రూపాయలు పెంచాలని కోరారు.
  6. ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన 750 మంది రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
  7. విశాఖ స్టీల్ ప్యావేట్ కరణను ఆపాలని, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్యం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్షణ, ఉపాధి హామీ వంటి పథకాలతో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, పెన్షన్, గ్రాడ్యుయేటివ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని అభ్యర్థించారు.
  8. రైల్వే ప్రైవేటీకరణను ఆపాలని, ప్యాసింజర్ రైలు సేవలను పునరుద్ధరించాలని కోరారు.
  9. వ్యవసాయం ఉపకరణాలపై జిఎస్టి రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమూర్తి సూరి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దస్తగిరి, రైతు సంఘం నాయకులు పెద్దన్న, ఆర్ఎంపీ డాక్టర్ నూర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :