అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డులో భారతీయ పత్తి సంస్థ గుంటూరు శాఖ సీసీఐ ఇంచార్జ్ భరత్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వారు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఆర్ బాలాజీ రావు రైతులకు కొన్ని సూచనలు చేశారు కేంద్ర ప్రభుత్వం వారు కనీసం మద్దతు ధర మూడు రకాలుగా విభజించారు క్వింటా కు మొదటి రకం 7521 రెండవ రకం 7471 మూడవ రకం 7421 నిర్ణయించారు ఇందులో తేమ శాతం ఎనిమిది శాతం నుండి 12 శాతం మధ్యలో ఉండాలి అంతకుమించి తేమ శాతం ఎక్కువగా ఉంటే భారతీయ పత్తి సంస్థ వారు కొనుగోలు చేయరు అలాగే మైక్రో నైర్ విలువ 3.00 తక్కువగా ఉన్న సిపిఐ వారు కొనుగోలు చేయరు రైతులు పత్తిని ప్లాస్టిక్ సంచులలో నింపుకొని వచ్చిన పత్తిని సిపిఐ వారు కొనుగోలు చేయరు, లూజు పద్ధతిని మాత్రమే అవలంబించాలి. రైతుల బ్యాంకు ఖాతా నెంబర్ కు ఆధార్ నంబరు అనుసంధానమై ఉండాలి నేరుగా ఏబీపీఎస్ ద్వారా నగదు ఖాతాల్లోకి జమ అవుతుంది కాబట్టి పై సూచనలు పాటించి రైతులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సిబ్బందితోపాటు రైతులు పాల్గొన్నారు.